వినాయక చవితి కానుకగా 'అఖండ'...?

post

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తున్న  'అఖండ' సినిమా కోసం  అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి, బాలకృష్ణ కాంబోలో రాబోతున్న మూడవ సినిమా అఖండ కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి . ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మే 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పడిప్పుడే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని తొలగించింది. అటు ఏపీలోనూ కోవిడ్ సెకండ్ కేసులు తగ్గుతుండంతో త్వరలోనే అక్కడ కూడా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి . దీనితో థియేటర్లు 50 శాతం ఆక్యూపెన్సీతో ఓపెన్ కానున్నాయి. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్స్ కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అఖండ 'సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వినాయక చతుర్థి కానుకగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.