200 మందికి వ్యాక్సిన్ వేయించిన దిల్ రాజు....

post

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ఇన్నాళ్లు అటకెక్కిన సినిమాలు ఇప్పుడు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుకునేందుకు రెడీ అయ్యాయి . అయితే నిర్మాత మండలి ఆదేశాల ప్రకారం షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరు కనీసం ఒక్క డోస్ అయిన వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పడంతో నిర్మాత దిల్ రాజు తన ప్రొడక్షన్ లో తన సినిమాల కోసం పనిచేస్తున్న సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది , ఆఫీస్ స్టాఫ్ అందరికి కోవిడ్ వాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేసాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్న దిల్ రాజు సుమారుగా 200 మందికి వాక్సినేషన్ ఇప్పించినట్టు తెలుస్తుంది.