ఇంతకంటే ఇంకేం కావాలి....

post

వరుస క్రేజీ సినిమాలతో బిజీగా ఉంటున్న కీర్తి సురేష్  సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్, తన సినిమా అప్‌డేట్స్ అలాగే తన క్లోజ్ ఫ్రెండ్స్, సినిమా టీంతోనూ ఉత్సాహంగా గడిపిన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో తాజాగా..వరల్డ్‌ పిక్‌ నిక్‌ డేకి నాకు సరైన తోడు దొరికిందంటూ పిక్‌నిక్‌ వెళ్లిన ఫొటోలను పోస్ట్ చేశారు కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో.. "సరైన తోడు, ఆహ్లాదకరమైన వాతావరణం.అందులోనూ బీచ్‌ ఒడ్డున హాయిగా సాగిపోయే పిక్‌ నిక్‌. ఇంతకంటే ఇంకేం కావాలి" అని తన పెంపుడు కుక్క నైక్‌తో మెసేజ్‌తో కూడిన ఫొటోలను పోస్ట్ చేశారు.