పవన్ సినిమాలో పెంచల్ దాస్ పాట...!

post

గాయకుడు పెంచల్ దాస్ పాడింది తక్కువ పాటలే అయినా అభిమానుల మనసుల్లో ఆయన బలమైన ముద్ర వేశాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో 'దారిచూడు దుమ్ముచూడు'.. శ్రీకారం సినిమాలో 'వచ్చానంటివో పోతానంటివో' వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న సినిమాలో పెంచల్ దాస్ ఫోక్ సాంగ్ పాడనున్నట్లు తెలుస్తోంది. మొదట పవన్ కళ్యాణ్ పాడతాడనే ప్రచారం జరుగగా, తాజాగా పెంచల్ దాస్ పేరు వినబడుతోంది. సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఓ నేపథ్యగీతాన్ని పెంచలదాస్ చేత పాడించాలని మేకర్లు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.