'సత్యమేవ జయతే 2' షూటింగ్ పూర్తి...

post

జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యమేవ జయతే 2’ సినిమా మొదటి సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్లోనే విడుదల కావాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది. సల్మాన్ ‘రాధే’ సినిమాతో ‘సత్యమేవ జయతే 2’ పోటీపడుతుందని అంతా భావించారు. కానీ, ఆ ప్రచారం నిజం కాలేదు. ‘రాధే’ ఓటీటీ లో విడుదల కాగా, ‘సత్యమేవ జయతే 2’ ఇంకా పెండింగ్ లో ఉంది. ముంబైలో ఇటీవలే లాక్ డౌన్ ఆంక్షలు సడలించి మళ్లీ షూటింగ్స్ కి అనుమతినివ్వటంతో ‘సత్యమేవ జయతే 2’కు సంబంధించి కొద్దిపాటి పెండింగ్ వర్క్ పూర్తి చేశారు చిత్ర యూనిట్. చిత్రీకరణ పూర్తి కావటంతో ఇప్పుడు జాన్ అబ్రహాం, దివ్య కోస్లా కుమార్ స్టారర్ ని థియేట్రికల్ విడుదలకు సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.