ప్రత్యేక గీతంలో ప్రగ్యా జైస్వాల్...!

post

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా 'ఎఫ్ 3'.ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 'ఎఫ్ 2' సీక్వెల్‌గా వస్తున్నది . దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే తదుపరి షెడ్యూలు షూటింగును ప్రారంభించనున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా ఓ ప్రత్యేకమైన పాట కోసం హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ప్రస్తుతం ఈ భామ బాలకృష్ణ కు జోడిగా 'అఖండ' సినిమాలో నటిస్తోంది.