బుల్లితెర టీఆర్పీ రేటింగ్ బ్రేక్ చేసిన వకీల్ సాబ్....

post

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన రీ ఎంట్రీ  సినిమా 'వకీల్ సాబ్' సినిమా థియేటర్స్ లలోనే కాకుండా బుల్లితెర ఫై కూడా సత్తా చాటింది. ఈ సినిమా జూలై 18న వరల్డ్ టీవీ ప్రీమియర్ గా జీ తెలుగు లో ప్రసారం కాగా ఈ సినిమాకు బుల్లితెర ప్రేక్షకులు నీరాజనాలు పలకడంతో గత  సినిమాల టీఆర్పీ రేటింగ్ లు బ్రేక్ అయ్యాయి. మొన్నటి వరకు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురం లో' సినిమా హైయెస్ట్ రేటింగ్ సాధించిన  సినిమాగా నిలువగా, ఇప్పుడు 'వకీల్ సాబ్' సినిమా ఆ రికార్డు ని బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ "అల వైకుంఠపురంలో" సినిమాకు టెలివిజన్ లో 29.4 రేటింగ్ రాగా, పవన్ 'వకీల్ సాబ్' సినిమాకు 32.20  రేటింగ్ రావడం విశేషం.