మూడు సినిమాలను చేస్తున్నట్లు తెలిపిన బాలకృష్ణ.....

post

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా నటించిన 'ఆదిత్య 369' సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ.. 'అఖండ' సినిమా తర్వాత ఆయన నటించబోయే సినిమాల గురించి వెల్లడించారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా, ఆ సినిమా తర్వాత హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా బాలకృష్ణ ఇకనుండి సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపాడు.