జర్నలిస్టు పాత్రలో ధనుష్‌....

post

తమిళ హీరో ధనుష్‌ తన 43వ సినిమాలో జర్నలిస్ట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మాళవిక మోహనన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కార్తిక్‌ నరేన్‌ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ కూడా ఈ సినిమాలో జర్నలిస్టు పాత్ర లో నటిస్తుందట . ధనుష్‌, మాళవికల జోడి ఈ సినిమాలో అలరిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొన్నారు .ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్‌ షూటింగ్‌  ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఇటీవలే హీరోయిన్ మాళవిక మోహనన్‌ ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసింది.