తెలంగాణ లో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు....

post

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టుతుండడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కాబినెట్ నిర్ణయం తీసుకుంది, అయితే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఇంటికెళ్లడానికి మరొక గంట అంటే సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకే సడలింపు ఇచ్చారు. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.