ఆ టీ తో ఎన్ని ఉపయోగాలు.....

post

సుగంధ ద్రవ్యాల్లో ఎక్కువ మంది ఇష్ట పడే వాటిలో దాల్చిన చెక్క ఒకటి. కొంతమంది దాన్ని మసాలాలలో కాకుండా... విడిగా కూడా తింటుంటారు. దాని పరిమళం, టేస్ట్ అంతలా ఆకట్టుకుంటుంది. దాల్చిన చెట్టు లోపలి బెరడునే దాల్చిన చెక్క అంటాం. చెట్టు నుంచీ తీశాక అది గుండ్రంగా చుట్టుకొని గొట్టాలలాగా మారిపోతుంది. వాటినే సిన్నమోన్ స్టిక్స్ (దాల్చిన చెక్కలు) అంటారు. వాటిని అలాగే నీటిలో ఉడకపెడతారు లేదా పౌడర్‌గా చేసుకొని... టీ తయారు చేయవచ్చు. దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండడంతో ఇది మన శరీరాన్ని రకరకాల వ్యాధుల నుండి  కాపాడతాయి. షుగర్, కాన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ టీ. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మంచి కొవ్వును పెంచుతుంది. ఓవరాల్‌గా గుండెకు హాని జరగకుండా చేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచెయ్యాలన్నా, మతిమరపుకి చెక్ పెట్టాలన్నా సిన్నమోన్ టీ తాగాల్సిందే. 

దాల్చిన చెక్క టీ తయారుచేసే విధానం..

ఓ కప్పు వేడి నీటిలో  ఓ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, సరిపడా చక్కెర వేసి కలపాలి. దాన్ని ఫిల్టర్ చేసి తాగేయడమే. లేదంటే... దాల్చిన చెక్కలను వేడి నీటిలో 10 నుంచీ 15 నిమిషాలు ఉంచి... ఆ నీరు తాగినా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో, ఆన్‌లైన్‌లో సిన్నమోన్ టీ బ్యాగులు కూడా దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కొని తాగినా ప్రయోజనం ఉంటుంది.