జాతీయ అవార్డు గ్రహీత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా మృతి...

post

జాతీయ అవార్డు గ్రహీత, బెంగాలీ డైరెక్టర్‌ బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సమస్యలతోపాటు, వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు (గురువారం) మృతి చెందాడు . ఆయన మరణంపై ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా బుద్దదేవ్‌ దాస్‌గుప్తా మరణం.. సినీ పరిశ్రమకు తీరనిలోటు అని ఆమె అన్నారు. ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాతలు సత్యజిత్‌ రే, ఘటక్‌ తర్వాత అంతర్జాతీయ సినిమా వేదికలపై ప్రముఖంగా నిలిచిన గొప్ప భారతీయ దర్శకుడంటూ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన దర్శకుడిగానే కాకుండా  సుప్రసిద్ధ కవి కూడా.