యాదాద్రి ఘాట్‌రోడ్డుపై విరిగిపడ్డ బండరాళ్లు...

post

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గురువారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరిసింహస్వామి కొండపైకి వెళ్లే రెండో ఘాట్‌రోడ్డు మలుమలుపు దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అటు వైపుగా ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్నవెంటనే అధికారులు రహదారిపై రాకపోకలు నిలిపివేసి బండరాళ్లను తొలగించారు. మొదటి ఘాట్‌రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.