పులిచింతల ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద....

post

పులిచింతల జలాశయానికి వరద ప్రవాహం అధికంగా వస్తుంది .పులిచింతల ఇన్ ఫ్లో 7,582 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,600 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 173 అడుగులకు చేరింది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 43.45 టీఎంసీలుగా ఉంది. మరోవైపు 3,4 యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.