రళలో 41కి చేరిన జికా వైరస్ కేసులు....

post

కేరళలో రాష్ట్రంలో జికా వైరస్ చాప కింద నీరులా చాలా వేగంగా విస్తరిస్తుంది . రోజు క్రమం తప్పకుండా కొత్తగా ఒకటి, రెండు కేసులు 
నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతోంది. బుధవారం కూడా కేరళలో కొత్తగా మరో ముగ్గురికి జికా వైరస్ సోకడంతో ఆ రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 41కి చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. ఆ 41 మంది జికా వైరస్ ఇన్‌ఫెక్టెడ్ రోగుల్లో 5 మంది పరిస్థితి మాత్రమే తీవ్రంగా ఉండటంతో ఆ 5 మందిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని, మిగతా అందరి పరిస్థితి సాధారణంగానే ఉందని ఆమె పేర్కొన్నది.