68ఏళ్ల తర్వాత ఓ మహిళకు మరణశిక్ష..

post

అమెరికాలో దాదాపు 68 సంవత్సరాల తర్వాత తొలిసారి ఓ మహిళకు మరణశిక్షను విధించారు. లిసా ఎం.మాంటెగోమేరీ అనే నేరస్థురాలికి ఈరోజు మరణశిక్షను అమలు చేశారు. చివరి సారిగా 1953లో ఒకరికి అమలు చేశారు. 52 సంవత్సరాల మేరీ ఓ గర్భిణిని హత్య చేసి ఆమె కడుపులో బిడ్డను అపహరించింది. దీనికితోడు ఆ పసికందును తన బిడ్డగా చెప్పుకొంది. ఈ కేసులో సుదీర్ఘ విచారణలు, క్షమాభిక్ష పిటిషన్ల తిరస్కరణ తర్వాత ఈరోజు శిక్షను అమలు చేశారు. ఆమెకు అమెరికా కాలమానం ప్రకారం  ఈరోజు తెల్లవారుజామున 1.31 సమయంలో విషపూరిత ఇంజెక్షన్‌ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్‌ ప్రిజన్స్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 11వ మరణశిక్ష.