మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు..

post

జీహెచ్ఎంసీ మేయర్‌గా ఈరోజు ఉదయం గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేయగా ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు వచ్చారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 11వ మేయర్‌గా ఆమె ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.