పుదుచ్చేరిలో కుప్పకూలిన నారాయణస్వామి ప్రభుత్వం...

post

పుదుచ్చేరిలో బలనిరూపణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం కావడంతో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పాటు మరో ఎమ్మెల్యే ఉద్వాసనకు గురవడంతో  కాంగ్రెస్‌ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలసి వచ్చింది. అయితే ఆదివారం కాంగ్రెస్‌-డీఎంకే ప్రభుత్వానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రస్తుత్తం ప్రభుత్వ బలం 11కు పడిపోయింది.