కపిల్ రికార్డుకు దగ్గరలో ఇషాంత్..

ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా మరో రెండు రోజుల్లో అహ్మదాబాద్ వేదికగా పింక్‌బాల్ టెస్టు జరగనుంది. అయితే భారత్ సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఇది 100వ మ్యాచ్ కావడంతో భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రెండో పేసర్‌గా ఇషాంత్ నిలవనున్నాడు. భారత్ తరఫున 100 టెస్టుల మైలురాయిని దాటిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కొనసాగుతున్నాడు.ఇంతవరకు 99 టెస్టులు ఆడి 302 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.