తెలంగాణలో కొత్తగా 925 కరోనా కేసులు...

post

రాష్ట్రంలో కొత్తగా మరో 925 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,62,653కి చేరింది.
కరోనా తో కొత్తగా మరో ఒక్కరు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,426కి చేరింది. కరోనా నుంచి మరో 1,367 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,49,157కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,070 యాక్టివ్‌ కేసులు ఉండగా , వారిలో 9,714 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.