రెండు బస్సులు ఢీకొని 16 మంది మృతి...

post

ఈరోజు తెల్లవారుజామున నోషీ బ్యుయెనా గనికి చెందిన కార్మికులను తరలిస్తుండగా ఉత్తర మెక్సికో సరిహద్దు ప్రాంతంలో రెండు బస్సులు బకదానినొకటి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన సంఘటనలో అక్కడికక్కడే 16 మంది గని కార్మికులు ప్రాణాలు కోలుపోగా ,మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు బస్సులు ఘోరంగా దెబ్బతిన్నాయి. రెండు బస్సులు అతివేగంగా రావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది . మృతి చెందిన వారు ఆ బస్సులోనే చిక్కుకు పోవడంతో ఆ మృతదేహాలను బయటకు తీయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.