అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 

post

హైదరాబాద్ లోని అప్జల్‌గంజ్‌లో ఈరోజు ఓ టైర్ల గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో మంటలు ఎగిసిపడుతుండడంతో ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన స్థలానికి దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.దీనితో చాదర్ ఘాట్ - అఫ్జల్‌గంజ్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పక్కనే గుడిసెలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ ప్రమాదం మూసీకి పక్కనే  జరగడంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఫైర్ ఇంజిన్లకు ఇబ్బందికరంగా మారింది. దాదాపు 15 ఫైర్ ఇంజిన్లు ఘటన స్థలానికి రాగ , అతికష్టం మీద 8 ఫైర్ ఇంజిన్లు అక్కడికి వచ్చి మంటలార్పే ప్రయత్నం చేస్తున్నాయి.