మామిడిపండు చేసే మేలు....!

post

ఎండాకాలం వచ్చిందంటే మొదట గుర్తోచ్చేవి మామిడి పండ్లు. ఈ  మామిడి పండ్లు పసుపు, నారింజ రంగుల సమ్మెళనంగా మిలమిలా మెరుస్తూ పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తాయి . వేసవిలో విరివిరిగా లభించే ఈ పండ్లు ఎంతో మధురంగా ఉంటాయి. కొన్ని పళ్ళు తీపి, పులుపు కలగలిపిన రుచితో నోరురిస్తాయి. అయితే, మనకు వేసవిలో ఎక్కువగా లభించే మామిడిపండ్లు ఆరోగ్యానికి, రుచికి, శరీర కాంతికి అధ్బుతంగా పని చేస్తుంది . మామిడిని వివిధ ఔషధ పదార్దాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. మామిడి పండ్లతో తాయారు చేసే తాండ్ర  వాంతుల్ని తగ్గించి, దాహార్తిని తప్పిస్తుంది. గర్భిణీ స్త్రీలకు వేవిళ్ళ సమయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. మామిడి పొడి, యాలకులు, పచ్చ కర్పూరం మున్నగు వాటితో తయారుచేసిన జామ్ ఎంతో పుష్టికరమైనది, పైగా బలవర్ధకం కూడా. బాగా పండిన మామిడి పండు గుజ్జులో కొద్దిగా నేతిలో వేయించిన బాదాం, జీడిపప్పు, ఎండుద్రాక్షలు, యాలకుల పొడి వేసి పూరీలలో నంజుకుని తింటే బాగుంటుంది. పచ్చి మామిడి కాయను ఉడికించి దాని తోకకు తీసేసి లోపలి గుజ్జుని జ్యూస్ చేసి, అందులో రుచికిసరిపద బెల్లం, కొద్దిగా యాలకుల పొడి వేసి తాగితే వేసవిలో కలిగే దాహార్తిని తగ్గించడంతో పాటు ఒంటికి చలవ చేస్తుంది.