దేశంలో కొత్తగా 46,232 కరోనా కేసులు......

post

దేశంలో గడిచిన 24 గంటలలో కొత్తగా మరో 46,232 కరోనా కేసులు నమోదుకావడంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరింది . కరోనా తో కొత్తగా మరో 564 మంది మృతి చెందడంతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,32,726 కి చేరింది . ప్రస్తుతం దేశంలో 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. 84,78,124 మంది కరోనా నుంచి కోలుకున్నారు.