బుధవారం ఆ స్వామి ని పూజిస్తే.....

post

అయ్యప్ప స్వామివారికి బుధవారం రోజున నిత్య పూజా క్రమంలో గానీ, దేవాలయానికి వెళ్ళి అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా శుభాలుకలుగుతాయి . అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసుని చంపిన తరువాత కేరళలోని శబరిమలైలో కొలివిదేరినాడు. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా కొలుస్తారు . శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి . కేరళలోని కుళతుపుళలో స్వామి ని బాలుని రూపంలో కొలుస్తారు .అయ్యప్ప స్వామిని బుధవారం పూజించే వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి . అంతేకాకుండా కార్తీక మాసంలో అయ్యప్ప  మాల ధరించి స్వామిని పూజించడం ద్వారా  కోరిన కోరికలు దక్కుతాయి .