ఐసీసీ వన్డే ర్యాంకుల్లో న్యూజిలాండ్ నంబర్‌వన్...

post

ఈరోజు ఐసీసీ టీమ్ ర్యాంకులను ప్రకటించగా వన్డేల్లో న్యూజిలాండ్ 121 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా ,118 పాయింట్లతో  ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా ,టీం ఇండియా 115 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉంది . ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా 4, 5 స్థానాలలో వరుసగా ఉన్నాయి . టీ20లలో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉండగా భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆ తర్వాతి ర్యాంకులలో వరుసగా నిలుచున్నాయి . వన్డే ఆటగాళ్లలో బాబర్ ఆజమ్ 865 పాయింట్లతో మొదటి స్థానంలో, విరాట్ కోహ్లీ 857 పాయింట్లతో రెండో స్థానంలో, రోహిత్ శర్మ 825 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. టీ-20ల్లో డేవిడ్ మలాన్ మొదటి స్థానంలో,అరోన్ ఫించ్  రెండో స్థానంలో, బాబర్ ఆజమ్ మూడో స్థానంలో కాన్వే,  విరాట్ కోహ్లీ వరుసగా 4, 5 స్థానాలలో ఉన్నారు.