మెంతి, ఉసిరితో  రోగనిరోధక శక్తి ని పెంచుకోవొచ్చు... 

post

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తుండడంతో ఇప్పుడు ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం కూడా ముఖ్యమే. ప్రస్తుత కాలంలో ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.ఉసిరి లో విటమిన్ సి పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది సహాయపడతాయి. 
 
మెంతిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఉసిరి, మెంతి కలిపి తినడం వల్ల శరీరంలో ఐరన్ క్రమంగా పెరుగుతుంది.అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. ఆమ్లా మరియు మెంతి రసం ఏ విధంగా రెడీ చేయాలంటే మొదటగా.. ఒక టీస్పూన్ మెంతి పొడి లేదా మెంతి ఆకులు, ఒక ఉసిరికాయ, అరగ్లాసు నీటిని తీసుకోండి. ఈ మూడింటిని కలిపి రుబ్బి పేస్ట్‌లా చేయండి. దానిని గ్లాసు నీటిలో వేసి మరిగించి వడకట్టి ప్రతి రోజూ ఉదయాన్నే త్రాగాలి. దీన్ని తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ పానీయాన్ని భోజనంతో తీసుకోకండి. ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం తీసుకోవడం మంచిది.