కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న కుల్దీప్‌ యాదవ్‌..

post

భారత్ దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. టీమ్‌ఇండియా ఆటగాడు ,స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నాడు. టీకా వేసుకుంటుండగా తీసిన ఫొటోను ఈ స్పిన్నర్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ... కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన కోరాడు. ఇప్పటికే పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ శర్మ, బ్యాట్స్‌మెన్‌ పుజారా, రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ తదితరులు టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఇంగ్లాండ్‌తో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC) సహా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పంత్‌, రహానె, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, కోహ్లీ, బుమ్రా, పుజారా బరిలో దిగనున్నారు.