తమిళనాడు ప్రభుత్వ నిధికి శంకర్ సాయం..

post

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదుకావడంతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదువ్వుతున్నాయి. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు తమ వంతు సహాయంగా తమకు తోచినంత ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు .  ముఖ్యoగా తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు ముందుకు వచ్చి తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీగా విరాళం ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీప్రముఖులు విరాళాలు ఇవ్వగా. తాజాగా దర్శకుడు శంకర్ తనవంతు సహాయంగా రూ. 10 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారట.