ఏపీలో కొత్తగా మరో 24171 కరోనా కేసులు.... 

post

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా మరో 24171 కరోనా కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  14,35,491 కి చేరింది .రాష్ట్రంలో కొత్తగా మరో 101 మంది కరోనా తో మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య  9372  కి చేరింది.కొత్తగా మరో 21,101 కరోనా నుండి కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 12,15,683 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో  2,10,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి.