2డీజీ ఔషధం మార్కెట్లోకి విడుదల......

post

దేశంలో ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో 2-డయాక్సి-డీ గ్లూకోజ్‌(2డీజీ) అభివృద్ధి చేసింది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా ఉపయోగించే 2-డయాక్సి-డీ గ్లూకోజ్‌(2డీజీ) ఔషధంను ఈరోజు (సోమవారం) ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌  విడుదల చేశారు. మొదట రక్షణ మంత్రి డ్రగ్‌ను విడుదల చేసి ఆరోగ్యశాఖ మంత్రికి అందజేయగా, డ్రగ్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియాకు అందజేశారు. 10000డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు. దీనిని నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఈ ఔషధాన్ని తయారు చేశారు.