ఏపీలో ఈ నెల లాస్ట్ వరకు కర్ఫ్యూ పొడిగింపు...

post

ఏపీలో రోజురోజుకు  అధికమోతాదులో నమోదైతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూను ఈ నెల లాస్ట్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులే అయిందని సీఎం జగన్  పేర్కొన్నాడు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలైన కర్ఫ్యూ ఉండాలని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు.రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు సీఎం చెప్పారు. రూరల్‌ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.ఏపీలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతోంది. దాదాపు 18 గంటల పాటు కర్ఫ్యూ అమలవుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు 20 వేల పై  కేసులు నమోదు అవుతున్నాయి.