మే 20న కేరళ సీఎం ప్రమాణస్వీకారం...

post

కేరళ ఆపద్ధర్మ సీఎం పినరయి విజయన్ ఈ నెల 20న రెండోసారి కేరళ సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు సీపీఐ (ఎం) క్రియాశీల కార్యదర్శి, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్‌) కన్వీనర్ విజయరాఘవన్ సోమవారం వెల్లడించారు. మే 20న విజయన్‌తోపాటు మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని చెప్పారు. మొత్తం 21 మంది సభ్యులతో కేరళ మంత్రివర్గం కొలువుదీరనుందని విజయరాఘవన్ తెలిపారు. నూతన క్యాబినెట్‌లో ఎల్‌డీఎఫ్ కూటమిలోని ప్రధాన పార్టీ అయిన సీపీఐ (ఎం)కు 12 స్థానాలు, సీపీఐకి నాలుగు స్థానాలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మిగిలిన ఐదు స్థానాల్లో కేరళ కాంగ్రెస్ పార్టీ, జనతాదల్ (ఎస్‌), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) పార్టీలకు ఒక్కో బెర్త్ ఖాయం చేసినట్లు చెప్పారు.