'మిడిల్ క్లాస్ మెలొడీస్'

post

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ , కన్నడ భామ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ' మిడిల్ క్లాస్ మెలొడీస్ ' . ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. సినిమా చాలా బాగుంది అనే టాక్ తెచ్చుకుంది. చిన్న కథకు తనదైన స్టైల్లో అద్భుతంగా చూపించాడు కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు. హీరో హీరోయిన్ లు తమ దైన నటనతో ఆకట్టుకున్నారు .ఈ సినిమా మన పక్కింట్లో జరిగే కథలా ఉండడంతో ఈ సినిమాకు ఓటిటిలో మంచి ప్రేక్షక ఆదరణ వస్తుంది . ఈ సినిమా కచ్చితంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు బాగా పైసలు తీసుకువచ్చేలాగా కనిపిస్తుంది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వ్యూస్ కూడా బాగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఇక ....