‘జాంబి రెడ్డి’ ఎలా ఉందంటే....

post

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ వర్మ నిర్మించిన  ‘జాంబి రెడ్డి’  సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు . తాజాగా ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ ఊరిలో అనుకోని పరిణామాలు జరుగుతూ, ఊరిలో ఉన్న వాళ్లంతా జాంబిలుగా మారిపోతుంటారు. అయితే తేజ, ఆనంది, దక్షా, ఆర్జే హేమంత్, గెటప్ శ్రీను మాత్రం మాములుగా ఉంటారు. అసలు ఆ ఊరిలోకి జాంబీలు ఎలా వచ్చాయి.? ఈ ఐదుగురు జాంబీలనుంచి తప్పించుకున్నారా..? ఉరిని కాపాడారా..? లేదా అన్నదే ఈ సినిమా కథ.  జాంబీలతో పోరాడే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హెలైట్‌. రాయలసీమ ఫ్యాక్షనిజానికి కామెడీని జోడించి చూపించాడు దర్శకుడు . మొదటి భాగం కొంచం స్లో గా అనిపించినప్పటికీ సెకండాఫ్‌ ఆకట్టుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ ప్రేక్షకులను  కట్టిపడేయడంలో దర్శకుడు విజయం సాధించాడు.