'ఉప్పెన' ఎలా ఉందంటే....

post

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న 'ఉప్పెన  సినిమా ద్వారా హీరోహీరోయిన్లు తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు . బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ సినిమా పాటలు ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడంతో అప్పుడే సగం విజయం సాధించింది . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఉప్పాడలో కోటగిరి శేషారాయనం(విజయ్‌ సేతుపతి) రాజకీయంగా పేరున్న వ్యక్తి. ప్రాణం కంటే పరువుప్రతిష్టలే మిన్నగా బతుకుతుంటాడు. అతడి కూతురు బేబమ్మ(కృతిశెట్టి) డిగ్రీ చదువుతుంటుంది. ఆశీ(వైష్ణవ్‌తేజ్‌) ఓ జాలరి. తండ్రితో కలిసి కలిసి సముద్రంలో చేపలు పట్టుకుంటూ బతుకుతుంటాడు. బేబమ్మను చిన్ననాటి నుంచి ఆశీ ప్రేమిస్తుంటాడు కానీ తన ప్రేమను ఆమెకు చెప్పడు . కానీ ఓ సంఘటన వారిద్దరిని కలపడంతో ,ఆశీతోనే జీవితాన్ని పంచుకోవాలని బేబమ్మ కలలు కంటుంది. వారి ప్రేమ విషయం బేబమ్మ తండ్రి  కి తెలువడంతో తన పరువును కాపాడుకోవడం కోసం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?శేషారాయనం బలాన్ని, బలగాన్ని ఎదురించి ఆశీ, బేబమ్మ తమ ప్రేమను నిలబెట్టుకున్నరా? ఆశీ పట్ల కూతురికి ఉన్న ప్రేమను శేషారాయనం ఎలా గుర్తించాడన్నదే ఈ సినిమా కథ . కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో స్వచ్ఛమైన అనుభూతిని పంచుతుంది.