అక్షర సినిమా రివ్యూ..... 

post

ఈ సినిమాలో నటీనటులు నందిత శ్వేత, శ్రీదేవి, సంజయ్ ,స్వరూప్ ,హర్షవర్ధన్, సత్య, షకలక శంకర్, మధునందన్ ,అజయ్ బోస్, అప్పాజీ, అంబరీష తదితరులు.... 


సంగీతం:  సురేష్ బొబ్బిలి. 
ఛాయాగ్రహణం:  నరేష్ బనిల్.. 
నిర్మాత : హరితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి
రచన-దర్శకత్వం చిన్ని. 


కరోనా లాక్ డౌన్ కారణంగా చాల సినిమాల షూటింగ్స్ , విడుదల వాయిదా పడి చాలా ఆలస్యంగా ఇప్పుడు విడుదల అవుతున్న సినిమాలలో 'అక్షర' సినిమా కూడా ఒకటి . నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో చిన్నితెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విశేషాలు ఏమిటో చూద్దాం..... 

కథ.. 

అక్షరా(నందిత శ్వేత ) ఎంమెసి  చదివి విశాఖపట్నంలో ఓ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా దరఖాస్తు చేసుకోగా ,ఆమె టాలెంట్ నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు దాన్ని బోర్డ్ ఆఫీస్ డైరెక్టర్లతో ఒకడైన శ్రీ తేజ.  కొన్ని రోజులు ప్రయాణం తరువాత ఆమెతో ప్రేమలో పడతాడు శ్రీ తేజ.  మరోవైపు అక్షర ఉండే కాలనీ లో ఉంటున్న ముగ్గురు కుర్రాళ్ళు కూడా అక్షరను ఒప్పించే ప్రయత్నంలో ఉంటారు అయితే....శ్రీ తేజ, అక్షరను ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి తీసుకువెళ్లి తన ప్రేమ గురించి చెప్తుంటే ఆమె అతన్ని కాల్చి చంపేస్తుంది . అంత దారుణానికి ఆమె ఎందుకు పూనుకున్నది . గతమేంటి ఆ హత్య తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగి అనేది మిగతా కథ.... 

కథనం విశ్లేషణ:

అక్షర అనే టైటిల్ ఈ సినిమాలో టీజర్ ట్రైలర్ లతో విన్న విషయాలను బట్టి ఇది విద్యా వ్యవస్థలో లోపాలు అందులో జరిగే దారుణాల నేపథ్యంలో సాగే సినిమా అన్నవిషయం తెలిసిపోతుంది . ఉన్నత విద్య వ్యాపారంగా మార్చి పిల్లల్ని ఒత్తిడి కి గురిచేస్తూ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను దోచేస్తున్న కార్పొరేట్ కళాశాలల మీద సంధించిన బాణమే అక్షర.  విద్య అనేది ప్రాథమిక హక్కు దాని డబ్బు తో  కొనడం తప్పు అంటూ హర్ష వర్ధన్ చెప్పే మాటలలో అక్షర సారమంత ఉంది.  ఇలాంటి బర్నింగ్ ఇష్యూ మీద వాస్తవ ఘటనల ఆధారంగా సీరియస్ గా సిన్సియర్ గా ఓ సినిమా తీయాలనుకోవడం మంచి ఉద్దేశ్యమే. ఈ అంశాన్ని సినిమాలో చర్చించిన తీరు ఆలోచింపజేస్తుంది.  అయితే దీన్ని పక్కన పెట్టి ఓ సినిమాగా అక్షర అంటే మాత్రం సమాధానం చెప్పడానికి తటపటాయించాల్సిందే .  మంచి అంశం మీద సినిమా తీయడం ఆ అంశాన్ని అర్థవంతంగా చర్చించే ప్రయత్నం చేయడం అభినందనీయం.  అయినా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే బలమైన కథ లేకపోవడం కథలు ఏమాత్రం కొత్తదనం లేకపోవడం అక్షరా కు పెద్ద ప్రతి కథలు అక్షర పేరుకే థ్రిల్లర్ సినిమా . ఇందులో ప్రేక్షకులను అంతగా చేసే అంశాలు లేవు తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి చూపించడం ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా కథనం సాగడం సినిమాకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు అవి అక్షరాలో  కనిపించవు అయితే విరామం తర్వాత మలుపు తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు సినిమా ఆరంభంలోనే ఒక కార్పొరేట్ కాలేజీ మేడ పై నుంచి పడి ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడడం తర్వాత హీరోయిన్  ఆ కాలేజీలో చేరి అందరిలో కలిసిపోవడం విద్య సంస్థ డైరెక్టర్ తో సన్నిహితంగా మెలగడం చూస్తే ఆమె వెనుక వేరే కథ ఉందని తన ఉద్దేశాలు వేరే ఉంటాయని ప్రేక్షకులలో ఒక అంచనా వచ్చేది . విరామం తరువాత ఆమె పాత్రను మలుపు తిరుగుతోంది ఊహ ముందే వచ్చేసింది అయితే అక్కడిదాకా దర్శకుడు కథనాన్ని ఎంత ఆసక్తికరంగా నడిపిస్తాడు అని చూస్తే కాలనీలోకి తీసుకువెళ్లి కామెడీ తో కాలక్షేపం చేయించాలని చూశాడు కానీ అది పూర్తిగా బెడిసి కొట్టేసింది.  సత్య శకలక శంకర్, మధునందు కామెడీ చాలా బాగా చేయగలరు కానీ వాళ్ళ పాత్రలు చాలా సాధారణంగా ఉండడం, హీరోయిన్ దగ్గర కాని వాళ్ళ వేషాలు అన్ని విసిగించడంతో  సహాయం చాలా భారంగా నడుస్తుంది.  విరామం తరువాత ఆసక్తి గా తెరకెక్కించిన దాన్ని నిలబెట్టేలా రెండవ భాగం లేకపోయింది. 

ఇన్వెస్టిగేషన్ తో ముడిపడ్డ సన్నివేశాలు బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అన్నట్లు తయారయ్యాయి.  స్పెషల్ ఆఫీసర్ పాత్ర చేసిన హడావిడి చేస్తే ఏదో ఊహించుకుంటాం .  తర్వాత సన్నివేశాలను తేల్చి పడేశారు.  వైజాగ్ సిటీ కమిషనర్ పాత్రను ఈ సినిమాలో చాల సిల్లీగా ,ఒక జోకర్ లాగా చూపించి ,సీరియస్ గా తీసుకోమంటే కష్టమే . 

హీరోయిన్ పోలీసులకు దొరికిన తరువాత ఆమె ఫ్లాష్ బ్లాక్ లో వచ్చే స్టోరీ చాల రొటీన్ గా అనిపించినా , సినిమాలో బలంగా అనిపించేది ఆ ఎపిసోడ్. హర్ష వర్ధన్ పాత్ర ,దానికి రాసిన సంభాషణలు, అతడి నటన ఫ్లాష్ బ్యాక్ కు సినిమాకు బలం గా నిలిచాయి . కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలా సొసైటీని కమ్మేస్తున్నాయని అనే విషయాన్ని ఆలోచింపజేసేలా తీర్చిదిద్దాడు దర్శకుడు.  అయితే  ఈ ఫ్లాష్ బ్యాక్ సహా రెండో భాగంలో ఎక్కడ కూడా కొత్త దనానికి  ఆస్కారం లేకపోయింది.  తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూడకుండా చెప్పేయొచ్చు.  అంత రొటీన్ గా సాగిపోతుంది. ముగింపులో మెరుపులు ఏమి లేవు .  అక్షర ముగింపు మొత్తంగా చూస్తే ఈ సినిమాలో చర్చించిన విషయం మంచిది.  ఆలోచింపజేసింది .  ప్రేక్షకులు రిలేటె చేసుకోగలిగేది . కానీ ఈ అంశం చుట్టూ అల్లుకొన్న కథ కథనాలు మాత్రం నిరాశకు గురి చేస్తాయి.  ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది సందేహమే. 

నటి నటులు:

ఈ కథ మొత్తం నందిత శ్వేత చుట్టూ తిరిగిన ఆమె నుంచి ఆశించే స్పెషల్ పెర్ఫామెన్స్ ఇందులో కనిపించదు.  తెలుగులో తొలి సినిమా ఎక్కడ పోతావు చిన్నవాడా సినిమాలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది .  తన పై  భారీ అంచనాలు ఉన్న నందిత అక్షర సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన అంత ప్రభావవంతంగా కనిపించదు, బాగా చేయలేదు.  కానీ నందిత నుంచి ఆశించిన స్థాయిలో తన పాత్ర, నటన శ్రీ తేజ్ ఓకే అనిపించాడు. విలన్ పాత్రలో సంజయ్ స్వరూప్ మెప్పించాడు . మొదట ఇతను విలన్ ఏంటి అనిపిస్తుంది ...  కానీ పోను పోను ఆ పాత్ర ఇంపాక్ట్ కనిపిస్తుంది .  హర్షవర్ధన్ సినిమా లో బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్పొచ్చు.  దర్శకుడు చెప్పాలనుకున్న బలమైన సందేశాన్ని ఈ పాత్రలో చెప్పించడం మంచి ఎత్తుగడ.   ఫ్లాష్ బ్యాక్ నిలబెట్టి హర్షవర్ధనే.  సత్య, శకలక శంకర్ నవ్వించడానికి గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం లేకపోయింది. 

సాంకేతికవర్గం:

సురేష్ బొబ్బిలి సంగీతం ఏమంత ప్రత్యేకంగా లేదు.  పాటలేవి  గుర్తించుకున్నే లాగా లేవు. నేపథ్య సంగీతం కొన్నిచోట్ల పర్వాలేదనిపిస్తుంది.  నరేష్ ఛాయాగ్రహణం ఒకే . నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు గా ఉన్నాయి. రైటర్ అండ్ దర్శకుడు చిన్ని... చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే ,  చదువు ఎలా చెప్పాలి ... చదువు ఎలా చదువాలిలో అతను బలంగా చూపించాడు. అతడి మాటలు చాల చోట్ల ఆలోచింప చేస్తాయి . విద్యా వ్యవస్థలోని లోపాలను బాగానే ఎత్తి చూపించాడు.  ఈ చర్చ వరకు  వరకు ఓకే కానీ ఈ అంశాలన్నీ చెప్పడానికి అతను రోటీన్ రివేంజ్ డ్రామా ఎంచుకోవడమే నిరాశపరుస్తుంది.