తెల్లారితే గురువారం రివ్యూ... 

post

మణికాంత్ దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా నటించిన చిత్రం 'తెల్లారితే గురువారం'. చిత్ర శుక్ల, మిషా నారంగ్ హీరోయిన్స్. రాజీవ్ కనకాల, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల తెల్లారితే గురువారం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వీరేంద్ర (శ్రీ సింహా), మధు (మిషా నారంగ్) కుటుంబ సభ్యుల బలవంతం మీద అయిష్టంతోనే పెళ్లికి ఒప్పుకొంటారు. కానీ పెళ్లి చేసుకోరు. తెల్లవారితే పెళ్లి అనగా కుటుంబ సభ్యులు రిసెప్షన్ నిర్వహిస్తారు. ఆ రిసెప్షన్ జరుగుతుండగానే పెళ్లి కొడుకు-పెళ్లి కూతురు పారిపోతారు. ఆ తర్వాత వారి జీవితంలో ఏం జరిగింది ? మధును వీరేంద్ర పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తాడు ? అలాగే హీరో తో పెళ్లికి హీరోయిన్ ఎందుకు వెనకడుగు వేస్తుంది ? వీరేంద్ర, కృష్ణవేణి ప్రేమకథ కు ముగింపు ఏమిటి ? అన్నది.. ఈ సినిమా కథ.

తెల్లారితే పెళ్లి పెట్టుకొని పారిపోయిన.. జంట కథ ఇది. దానికి కారణం ఏంటీ ? అనే ఆసక్తికర పాయింట్ తో సినిమాని ప్రారంభించాడు దర్శకుడు. ఎంటర్ టైనింగ్ కథని ముందుకు నడిపాడు. కానీ అంత ఎంతసేపు సాగలేదు. ఆ తర్వాత తడబడ్డాడు. రెండో భాగాన్ని మరింత సాగదీసి.. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడు.

శ్రీ సింహ నటించిన రెండో సినిమా ఇది. 'మత్తువదలరా'.. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి.. దానిలో కొన్ని పరిమితులు కనిపించాయి. అయితే తెల్లారితే గురువారంలో శ్రీసింహాకు కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ పండించే అవకాశం వచ్చింది. వాటిలో మెప్పించాడు కూడా. కథ-కథనాలు గ్రిప్పింగ్ సాగకున్నా.. తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.కాల భైరవ సంగీతం బాగుంది. పాటలు సిట్యుయేషన్‌ పరంగా అలరించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫి బాగుంది. సెకాంఢాఫ్ స్లోగా సాగింది. బాగా సాగదీశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాను  ఓ సారి చూడొచ్చు..