'వైల్డ్ డాగ్'రివ్యూ.... 

post

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'వైల్డ్ డాగ్' సినిమా ఫస్ట్ లుక్ నుండే ఆసక్తి రేపింది . శుక్రవారం ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా. ఎన్‌.ఐ.ఎ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా వుందో  చూద్దాం..ఈ సినిమాలో నాగార్జున  ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ఏసీపీ విజయ్ వర్మ కి  వైల్డ్ డాగ్ అని పేరు. ఉగ్రవాదుల్ని పట్టుకోవడం కంటే కూడా అంతం చేయడానికే ఇష్టపడుతుంటాడు. పూణెలో ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దానికి కారణం.. ఖాలీద్ అనే ఉగ్రవాది. తనని పట్టుకోవడానికి ఎన్‌.ఐ.ఏ విజయ్ వర్మని నియమిస్తుంది. తన టీమ్ తో చేసిన ఆపరేషనే `వైల్డ్ డాగ్‌`. ఖలీద్ ముంబై కి వెళ్లుతాడు. 

వైల్డ్ డాగ్ టీమ్ ముంబై వెళ్లి ఓ ప్లాన్ వేస్తారు కానీ చివరి క్షణాల్లో ఆ ప్లాన్ నుండి ఖాలీద్ తప్పించుకొని నేపాల్ పారిపోతాడు. దానితో `వైల్డ్ డాగ్‌` టీం ఖాలీద్ ని పట్టుకోవడానికి నేపాల్ వెళ్తుంది. మరి నేపాల్ లో అయినా ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా , లేదా? ఖాలీద్ ని ప్రాణాలతో ఇండియాకు ఎలా తీసుకొచ్చారన్నదే మిగిలిన కథ.

2006 నుంచి ఐదారేళ్ల పాటు భారతదేశంలో జరిగిన బాంబు పేలుళ్ల  సంఘటనల వెనక సూత్రధారుల్ని కనిపెట్టి దేశానికి తీసుకొచ్చిన పరిణామాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ పేలుళ్లు. వీటి వెనుక కుట్రలు.. దర్యాప్తు సంస్థలు చేసిన ఆపరేషన్లు. సూత్రధారి యాసిన్ భత్కల్‌ని ఇండియాకి తీసుకురావడం. ఇవన్నీ ప్రేక్షకులకు తెలిసిన విషయాలే. ఐతే వీటిని తెరపై చుపించే ప్రయత్నం చేశారు.
 

ఇలాంటి స్టోరీలకు విచారణ చేసే స్టయిల్ చాల ఆసక్తి కరంగా వుండాలి. కానీ ఈ సినిమాలో సీసీ కెమెరాలు చూసి ఆ దాడి ఎవరు చేశారో తెలుసుకోవడం వంటిది చాల చప్పగా ఉంది . ఆ తరవాత ఖాలీద్ ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలే ఈ సినిమాలో  కీలకం. ముంబైలో స్కెచ్ వేసి ఖాలీద్ ని పట్టుకోవడానికి ప్రయత్నించడం, ఖాలీద్ తెలివిగా అక్కడ్నుంచి తప్పుకోవడం వంటివి అక్కడక్కడ ఆకట్టుకుంటుంది.
 ఇక ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ఇంకో టర్న్ తీసుకుంది. ఇంటర్వెల్ తరువాత కథ నేపాల్ కి మారుతుంది . నేపాల్ వెళ్లగానే..  అక్కడ `వైల్డ్ డాగ్` టీమ్ మీద ఓ దాడి జరుగగా ,ఆ దాడి ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అని తెలుసుకోవడం మరో కోణంలో మారిపోయింది. నిజానికి అది ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. ఖాలీద్ ని పట్టుకోవడానికి ప్రయత్నించడం, విఫలం అవ్వడం. దాదాపు సినిమా అంతా ఇలానే సాగుతుంది. దీంతో చాలా చోట్ల చప్పాగా వుంటుంది.

నాగార్జున ఎన్‌.ఐ.ఎ అధికారిగా చూడ్డానికి ఆకట్టుకునేలా కనిపిస్తారు. దియామీర్జా పాత్రకి ప్రాధాన్యం లేదు. సయామీఖేర్ రా ఏజెంట్‌గా కనిపిస్తుంది. వైల్డ్‌డాగ్ టీమ్‌లో నటించిన  నలుగురు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా విభాగానికి మంచి మార్కులు వస్తాయి . తమన్ అందించిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి..