ఎన్పీఆర్కు ధ్రువపత్రాలు అవసరంలేదు
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నమోదులో భాగంగా ప్రజల వద్ద నుంచి ఎటువంటిపత్రాలు తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్యను వారు స్వచ్ఛందంగా తెలిపితేనే నమోదు చేస్తామని ఇందుకోసం ఎవర్ని బలవంతం చేయబోమని వెల్లడించింది. ఎన్పీఆర్ నమోదు గురించి రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని, వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. కుటుంబ, వ్యక్తిగత వివరాలతో పాటు వారు నివసిస్తున్న గ్రామ, పట్టణ, నగరానికి సంబంధించిన వివరాలను మాత్రమే నమోదు చేయనున్నట్లు పేర్కొంది.దేశవ్యాప్తంగా ఎన్పీఆర్ నమోదు ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30,2020 వరకు నిర్వహించనున్నారు.