ట్రంప్ VS నాన్సీ

post

మంగళవారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి వార్షిక ప్రసంగం చేశారు. అయితే అంతకుముందు తన ప్రసంగం కాపీని ప్రతినిధుల సభ స్పీకర్‌ ట్రంప్‌ నాన్సీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె అధ్యక్షుడికి షేక్‌హ్యాండ్‌ అందించగా.. ట్రంప్‌ తన చేతిని ఇవ్వకుండానే వెనక్కి తిరిగారు. ఈ పరిణామంతో నాన్సీ ఒకింత అసహనానికి లోనయ్యారు. అయితే ఆ తర్వాత ట్రంప్‌ తన ప్రసంగాన్ని పూర్తి చేస్తుండగా సభలోని వారందరూ చప్పట్లు కొడుతూ అభినందించారు. ఆ సమయంలో నాన్సీ ఉన్నట్టుండి ట్రంప్‌ ప్రసంగం కాపీలను చించేశారు. కాగా.. ట్రంప్‌ ప్రసంగ పత్రాలను ఎందుకు చించేశారని నాన్సీని విలేకరులు అడగ్గా.. ‘ఎందుకంటే ఆయన చేసిన పనికి ప్రత్యామ్నాయంగా ఇదే మర్యాదపూర్వకమైన పని’ అని ఆమె బదులిచ్చారు. గతంలోనూ వీరి మధ్య ఇలాంటి సందర్భాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగం సందర్భంగా నాన్సీ వెటకారంగా చప్పట్లు కొట్టారు. ఇటీవల ట్రంప్‌పై అభిశంసన తీర్మానంపై నాన్సీ వేగంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ ఎదురుపడటం ఇదే తొలిసారి.