5 జోన్లు.. 3 హెల్త్ వర్సిటీలు
ఏపీని ఐదు జోన్లుగా విభజించి, వాటి పరిధిలో మూడు హెల్త్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బోధనాస్పత్రి వస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ‘నాడు – నేడు’, సబ్సెంటర్ల నిర్మాణం, కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య కార్డులు జారీపై మంగళవారం వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.