కరోనా ఎఫెక్ట్ : తీరంలో ప్రయాణికుల నౌకను నిలిపివేసిన జపాన్‌..!

post

 

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చివరికి నౌకలో ప్రయాణిస్తున్న వారిని కూడా వదలలేదు. 3711 మంది తో ప్రయాణిస్తున్న జపాన్ కు చెందిన ఓ క్రూయిజ్ షిప్ లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ శోకిందని నిర్ధరణ అయింది. అయితే ఈ నౌక యొకొహామా తీరానికి చేరింది. కానీ జపాన్ ప్రభుత్వం అక్కడే నిలిపి ఉంచింది. దీంతో ప్రయాణికులంతా 24గంటలుగా అందులోనే ఉండిపోయారు. వారందరికీ.. వైద్య పరీక్షలు చేసే వరకు వారిని నౌక నుంచి బయటకు వదిలేది లేదని అధికారులు తెలిపారు. వైద్యులు పరీక్షలు ప్రారంభించారు… హాంగ్ కాంగ్ కు చెందిన 80 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ నౌకలో 2,666 మంది ప్రయాణికులు … 1,045 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.