0px

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' రివ్యూ.....   

1 month ago

సుశాంత్ , మీనాక్షి చౌదరి జంటగా నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఎలా ఉందో చూద్దాం..  హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ (సుశాంత్‌) ఒక ఆర్కిటెక్ట్‌. అతను పనిచేసే ఆఫీస్‌లోనే మీనాక్షి అలియాస్‌ మీను (మీనాక్షి చౌదరి) కూడా ఎంప్లాయ్‌గా జాయిన్‌ అవుతుంది. తొలి చూపులోనే మీనాక్షితో ప్రేమలో పడిపోతాడు అరుణ్‌. ఆమె కోసం డ్రైవింగ్‌ నేర్చుకొని మరీ కొత్త బైక్‌ని కొంటాడు. ఒక రోజు మీనాక్షి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని, కొత్త బైక్‌ వేసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు అరుణ్‌. అదే సమయంలో ఆ ఏరియాలో ఓ సీరియల్‌ నటిపై మర్డర్‌ అటెంప్ట్‌ జరుగుతుంది. ఇది అరుణే చేశాడని భావించి ఆ ఏరియా జనాలంతా అరుణ్‌ కోసం వెతకడం ప్రారంభిస్తారు. వారిని నుంచి అరుణ్‌ ఎలా తప్పించుకున్నాడు? అరుణ్‌ని కాపాడడం కోసం మీనాక్షి ఏం చేసింది? అసలు సీరియల్‌ నటిపై హత్యాయత్నం చేసిందెవరు? పులి(ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందులోకి నర్సింహ యాదవ్‌(వెంకట్‌) ఎలా ఎంటర్‌ అయ్యాడు? 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'అనే టైటిల్‌కి ఈ కథకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే?
అరుణ్‌ పాత్రలో సుశాంత్‌ అద్భుత నటనను ప్రదర్శించాడు. డాన్స్‌తో పాటు ఫైటింగ్‌ సీన్స్‌ కూడా అదరగొట్టేశాడు. గత తన సినిమాల్లో కంటే ఇందులో సుశాంత్‌ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. ఇక మీను పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఓ ఏరియా కార్పొరేటర్‌గా వెంకట్‌ పర్వాలేదనించాడు. హీరో ప్రాణ స్నేహితుడు పులి పాత్రలో ప్రియదర్శి అద్భుత నటనను కనబర్చాడు. బైక్‌ షోరూం ఎంప్లాయ్‌గా వెన్నెల కిశోర్‌ తనదైన కామెడితో నవ్వించే ప్రయత్నం చేశాడు.అభినవ్ గోమతంతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే?
'ఇచ్చట వాహనములు నిలుపరాదు'అనే కొత్త టైటిల్‌ పెట్టి సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు దర్శన్‌.. కథనంలో మాత్రం కొత్తదనం లేకుండా, సాదాసీదాగా నడిపించాడు. కథలో పెద్దగా స్కోప్‌ లేకపోవడంతో కొన్ని అనవసరపు సీన్స్‌ని అతికించి అతి కష్టం మీద రెండున్నర గంటల పాటు సినిమాను లాగాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అసలు సస్పెన్స్‌ని ఇంటర్వెల్‌ వరకు రివీల్‌ చేయకపోవడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక సెకండాఫ్‌లో అయినా ఆకట్టుకునే అంశాలేమైనా ఉంటాయకునే ప్రేక్షకుడికి అక్కడా నిరాశే ఎదురవుతుంది. సినిమాలో చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. కానీ, నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్న దర్శకుడి ఆలోచనను ప్రశంసించాల్సిందే. ఇక ఈ సినిమా ప్రధాన బలం ఏదైనా ఉందంటే అని ప్రవీణ్ లక్కరాజు సంగీతమనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎం.సుకుమార్‌ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ గ్యారీ బి.హెచ్‌ చాలా చోట్ల తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.