0px

ఆ కుక్కకి ఐసీసీ అవార్డు..

1 month ago

ICC ప్రతి నెల క్రికెటర్లకు అవార్డులు ప్రకటింస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఓ కుక్క కి అదృష్టం వరించింది.. ఐసిసి అవార్డు కుక్కకా అని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజం. అయితే, ఈసారి కుక్కకు కూడా అందులో చోటు దక్కించుకున్నది. ఐసిసి దీనిని ఓ  ప్రత్యేక పురస్కారంతో సత్కరించింది. అసలు ఏం జరిగిందంటే .. ఐర్లాండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో ఒక కుక్క మైదానంలోకి దూసుకెళ్లి బంతిని నోటితో పట్టుకుని పరిగెత్తి బ్యాటర్ వద్దకెళ్లి ఆ బంతిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి స్పందించిన ICC కుక్కకు ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. బ్యాటర్‌కు బంతిని అందించి అందరి హృదయాలను చూరగొన్న ఆ కుక్కను  ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. నోటిలో బంతి మరియు తలపై టోపీ ఉన్న కుక్క ఫోటోను ఐసిసి షేర్ చేసింది.