0px

వీక్షణల రికార్డులు సృష్టిస్తున్న "1977" చిత్రం పాట...

3 weeks ago

భారతదేశపు సినిమా ప్రేమికులు ఈ మధ్య తెలుగు సినిమా పాటలలకు ప్రతీ వారం యూట్యూబ్ మాధ్యమం ద్వారా తమ ఆదరణ తెలుపుతూనే ఉన్నారు. పాట బాగునప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సామాజిక మాధ్యమం ద్వారా ప్రచురణగావించి ట్రెండింగ్ పరిధిలో ఉండటం మామూలు విషయమే. ఆ ట్రెండింగ్ నంబరు కాస్త దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలవారికి "ఇదేదో టాప్ లో ఉందే..ఒకసారి వినిచూద్దాం" అని చేరువ చేస్తూ వీక్షణాలను అధిక సంఖ్యలో రోజురోజుకి పెరుగుతూ వెళ్ళటం,ఆ పాటలు వారికి భాషాబేధం లేకుండా నచ్చటం నిజంగా రికార్డు మించిన విజయమే మరి.

ఈ మధ్యకాలంలో అలా రికార్డు స్థాయిని అందుకుంటున్న పాట "ఏమి బతుకు". ఇది కొత్తగా రాబోతున్న 1977 సినిమాలోని ప్రముఖ గాయని మంగ్లీ పాడిన పాట.నవీన్ చంద్ర,డా.మోహన్ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రధారులుగా డా మోహన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. సామాజిక అంశాలతో ఆసక్తి కరంగా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నా కొన్ని యధార్థ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం అని ఈ సినిమా చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాలో "ఏమి బతుకు" ఇప్పుడు 70లక్షల వీక్షణలు దాటి ఇంకొద్ది రోజుల్లో 80 కి అధిగమించే తీరుగ ట్రెండింగులో ఉండటం విశేషం.

ఈ పాట "మంగ్లీ" గాత్రం ఆలపించగా, ప్రముఖ సంగీత దర్శకులు "కోటి" గారిచే సంగీతం అందించబడింది. చాలా రోజుల తర్వాత కోటి గారు ఈ సినిమాకి సంగీత దర్శకులుగా పనిచేయటం ,అందులోని మొదటి పాట ఇంత హిట్టు కావటం పై వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . మీనాక్షి రమావత్ నిర్మాణంలో ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకం పై త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ అగ్రహారంలో చర్చలు మొదలు అయ్యాయి. మొదటి పాటే ఇలా రికార్డులు వైపు పరుగులు తీస్తుంటే మిగితా పాటలు ఇంకెలా ఉండబోతాయో అని ఆశ్చర్యం తో కూడిన ప్రశ్నలు తెలుగు సినీ పరిశ్రమలో రేకెత్తిస్తున్నాయి.