0px

మేర్లపాక గాంధీ..  వినోదం-ఉత్కంఠం కలగలిపే దర్శకుడు. 

1 month ago

తెలుగు సినీమా దర్శకులలో ఎంతోమంది వైవిధ్యమైన దిగ్గజాలు లెక్కలేనంత మందే ఉన్నారు. 
కాలం మారుతున్న కొద్దీ పాత్రల ద్వారా కథ చెప్పే విధానం మారింది. 
తెర పై కథను చూపించే విధానం కూడా ప్రతి శుక్రవారం మారుతూనే ఉంది. 
ఒకరేమో సామజిక బాధ్యతతో కూడిన చిత్రాలు తీయగలరు.
ఇంకొకరేమో వినోదాల విందుగా చిత్రాలు తీయగలరు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క శైలి కలిగి ఉన్న దర్శకులు చాలా మందే ఉన్నారు.
కానీ, వినోదం అనే ముఖ్య అంశాన్ని థ్రిల్ తో జోడించి తీసే దర్శకులు కొంతమందే ఉన్నారు. 
ఈ యంగ్ జనరేషన్ లో అలాంటి దర్శకులు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. 
అలాంటి వారిలో మన మేర్లపాక గాంధీ మంచి మురుకులు దక్కించుకున్నాడు.  "వేంకటాద్రి ఎక్స్ప్రెస్" తో దర్శకత్వ జీవితం ప్రారంభం చేశారు. 
 సందీప్ కిషన్-రకూల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం. 
సందీప్ కిషన్ కి తన సినిమా జాబితాలోనే రికార్డు స్థాయిలో పేరు తెచ్చిన చిత్రం కూడా. 
మొదటి సినిమాతోనే సినిమా వ్యవస్థని తన వైపు చూసేలా చేసుకున్నాడు ఈ మేర్లపాక గాంధీ. 
మంచి కథ,దానికి తోడు వినోదాలని మంచి ఉత్కంఠ భరితంగా మేళవించే కొత్త కథనం. 
సినిమా మొదలుకొని చివరి వరకు ఒక్క సన్నివేశంకూడా నిరాశ పరచకపోవటం అనేది ఇందులో వున్న గొప్ప విషయం.
ఈ సినిమా విడుదల రోజున "సరదాగా నవ్వుకుందాం" అని ట్రైలర్ చూసి వెళ్లినవాళ్ళకి.. 
"మిమ్మల్ని నవ్వించి, ఆ నవ్వుని మర్చిపోనివ్వకుండా మళ్ళీ-మళ్ళీ థియేటర్ కి రప్పించేస్తాం" అన్నట్లు నిరూపించారు మన దర్శకుడు.  
మేర్లపాక గాంధీకి ఇది అధికారికంగా మొదటి సినిమా అయినప్పటికీ,
ఎంతో నేర్పుతో,వైవిధ్యమైన తన దర్శక పని తీరుతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకుడిని తనని తాను పరిచయం చేసుకున్నాడు. కుటుంబాన్ని బాధ్యతగా తీర్చి దిద్దాలి అనుకునే తండ్రి,
తను ఎంత మంచి పని చేసిన చివరికి పరిస్థుతుల ప్రభావం వల్లా అది తప్పు అనిపించుకునే కొడుకు.. 
కట్ చేస్తే ఇంట్లో ఒక శుభకార్యం కోసం తిరుపతికి వెళ్లాల్సి వస్తే,
అనుకోకుండా ఈ కొడుకు కుటుంబం మొత్తం వెళ్తున్న  రైలు ఎక్కడం కుదరకుంటే,
ఆ రైలుని ఎలాగైనా చేరుకొని అందుకోవాలి అని చేసే ప్రయత్నంలో అనుకోని పరిస్థితులు ఎదురయ్యి,
ఎట్టకేలకు ఎలా చేరుకున్నాడు అనేది ప్రీ క్లైమాక్స్ వరకు  జరిగే కథ. 
ఈ మధ్యలో దర్శకుడు నడిపించే కథ,ఎంత వినోద భరితంగా ఉంటుంది అంటే,
కొన్ని పాత్రలతో ఆయా పరిస్థులని వినోదం తో మేళవించి,
రైలు అందుకోవాలి అనే పాయింట్ ని ఉత్కంఠ భరితంగా జోడిస్తూ జనాలను తెగ అలరింప చేశాడు మన మేర్లపాక గాంధీ.
అది ఊహించనంత విజయం అందుకునే సరికి,
మంచి మంచి సినిమా ఛాన్సులు రావటం మొదలు పెట్టాయి.
మళ్లీ అదే జోనర్ కథకి ప్రాధాన్యం ఇచ్చి ఈ సారి రెండింతలు వినోదం మరియూ థ్రిల్ కలిగించేలా కథను తయారు చేశారు మేర్లపాక. 
అదే.. శర్వానంద్-సురభి జంటగా నటించిన "ఎక్స్ప్రెస్ రాజా " ఎక్స్ప్రెస్ అనే పదం సెంటిమెంటో లేదో తెలీదు కానీ,
బాక్స్ ఆఫీస్ పరంగా చాలా బాగా కలిసొచ్చింది. 
ఒకే జోనర్ కథని రెండు సార్లు రెండు విధాలుగా చూపించి థ్రిల్ చేస్తూ నవ్వించటం మేర్లపాక గాంధీకే సాధ్యమైంది. 
కథనం విషయానికొస్తే, మన టాలీవుడ్ చరిత్రలోనే అలాంటి వినోదభరిత సస్పెన్స్ థ్రిల్లర్లు రానేలేదు. 
వినోదానికి కేర్ అఫ్ అడ్రస్ అన్నట్లుగా.. అంతబాగా మెప్పు పొందాడు. 
ఇది కూడా సూపర్ హిట్ అయ్యేసరికి,
ఈ యువ దర్శకుడి నుంచి తరువాత రాబోయే సినిమా ఏం అయి ఉంటుంది అన్న ఆసక్తి ప్రేక్షకుడితో పాటు సినిమా టౌన్ లో కూడా ఒక టాక్ గా మారిపోయింది.  మూడో సినిమాకి కొద్దిగా సమయం తీసుకున్నప్పటికీ,
ఈ సారి వినోదం ప్రధానం కాకుండా..
ఒక సామాజిక అంశాన్ని ఎన్నుకొని దాని చుట్టూ పాత్రలు అల్లుతూ వెళ్ళిపోయాడు మన మేర్లపాక  గాంధీ. 
అదే,నాని ద్విపాత్రాభినయం చేసిన "కృష్ణార్జున యుద్ధం". 
ఇందులో అనుపమ పరమేశ్వరన్ మరియు రుక్సార్ ధిల్లన్ నటించారు. 
గత రెండు సినిమాలాగే ఉంటుంది అని వచ్చిన ప్రేక్షకుడికి కొద్దిగా షాక్ తగిలింది అనే చెప్పాలి. 
కథ పరంగా మంచి మార్కులు పడినా, ఎక్కడో తీరని లోటు ఉండిపోయింది. 
ప్లాప్ అని కాకుండా ఒక మోస్తరు గా ఆడింది సినిమా. 
విభిన్నంగా మొరటోడిగా ఒక పాత్ర చేసిన నానికి,తన నటనకు మంచి పేరు తేచి పెట్టింది కూడా. 
ట్రైలర్ లో చూపించిన విధంగా,ఇద్దరు నాని పాత్రల మధ్య యుద్ధం అయ్యి ఉంటుంది అనుకునే ప్రేక్షకులకు.. 
అంచనాలని పెంచేసిన ఆ సినిమా పేరు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.
ఎంత బాగాలేకపోయిన,ప్లాప్ అయినా..
కొంతమంది దర్శకులకు మంచి సినిమా తీయగల సత్తా ఉంటుంది అనే తెలుగువారి నమ్మకమే మళ్ళీ ఇంకో సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ఆ సినిమా తరువాత చాల గ్యాప్ ఏర్పడినప్పటికీ ఎలాంటి అధికారిక వార్త లేకపోవటంతో,
మేర్లపాక దర్శకత్వం తీరు తెలిసిన అభిమానులు కొద్దిగా నిరాశ పడ్డారు.
ఈ లోపు తను ఒక సినిమాకి దర్శకత్వం బదులు కథని మాత్రమే అందించిన చిత్రం విడుదల అయ్యింది. 
సంతోష్ శోభన్ నటించిన "ఏక్ మినీ కథ". 
థియేటర్ సమస్యలు ఉండటం వల్లా,ఈ సినిమాని ఈ సంవత్సరమే కొద్దీ నెలల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేశారు. 
దర్శకత్వం అనేది లేకపోయినా తన కథతో మళ్ళీ మెప్పించాడు మన మేర్లపాక. 
సమాజంలో జరుగుతున్నా ఒక బోల్డ్ పాయింట్ ని తీస్కొని కథ వినోద భరితంగా రచించాడు. 
ఆ కథని తీస్కొని అందంగా అమర్చిన దర్శకుడు కార్తీక్ రాపోలుకి కూడా మంచి పేరు దక్కింది. 
ఎంత కథ అందించి హిట్టు కొట్టినా..సొంతంగా దర్శకత్వం చేసి అలరించటంలో ఉన్న కిక్కు ఎక్కడికి పోతుంది?
అందుకే ఆ కథ రచన ప్రక్రియలో ఉండగానే వేరే సినిమాకి దర్శకత్వం మొదలు పెట్టాడు.   
 ఆ సినిమానే ఈ వారం విడుదల కబోయే "మాస్ట్రో" నితిన్-తమన్నా-నాభా నటేష్ కలిసి నటిస్తున్న చిత్రం ఈ "మాస్ట్రో ". 
ఇది హిందీ చిత్రం "అంధాదున్" కి మన తెలుగు రీమేక్. 
సొంత కథ కానప్పటికీ ప్రేక్షకుడు మేర్లపాక నుంచి తన మార్కు వినోదం కోరుకుంటాడు. 
అందుకే ఈ మధ్య జరిగిన సినిమా ప్రమోషన్ లో తన మార్కు ప్రతిభ కనపడేలా చిన్న-చిన్న మార్పులు చేర్పులు చేశానని అన్నారు. 
నిజానికి ఇదొక మిస్టరీ థ్రిల్లర్. 
నితిన్ కి ఒక విభిన్నమైన పాత్ర.కళ్ళు కనిపించకపోవటం అనేది ఆ పాత్రకి మూలం.
రీమేక్ కదా ఎలా తీస్తాడో ఏంటో అని అనుకునే ప్రతి ఫ్యాన్ కి తన ట్రైలర్ తో "ఇలాంటివి కూడా తీయగలను" అని సమాధానమిచ్చాడు మన మేర్లపాక గాంధీ. 
రీమేక్ కథకి మన తెలుగు నానుడికి తగిన కథనం అమర్చాలంటే కాస్త ధైర్యం కావాలి.
అలంటి ధైర్యమే చేసి మరీ తీసాడు ఈ సినిమాని. 
ట్రైలర్ చూస్తుంటే నిజంగా కొత్తగా ఉంది. రీమేక్ అన్న ఛాయలు ఎవరో చెప్తే తెల్సుకోవాలి తప్ప మొదటి సరి చూసినవారికి మాత్రం మాములు సినిమాలనే కనపడుతుంది రీమేక్ టాగ్ లేకుండా. 
ఈ సినిమా ఈ సెప్టెంబర్ 17న విడుదల అవుతుంది. 
కాకపోతే థియేటర్లో కాదు. హాట్స్టార్ లో విడుదల కానుంది. 
ఇందుకు గాను సినిమా టీం అంత ప్రమోషన్ లో భాగంగా పాల్గొంటున్నారు. 
ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి జరపబోత్తున్నారు. 
ఏదైతేనేం,రీమేక్ అయినప్పటికీ మెర్లపాకి దర్శకత్వం ఇష్టపడే వారికీ ఈ సినిమా 17న విడుదల కాబోతుంది. 
ఇంట్లోనే హాయిగా కుటుంబంతో చూసి ఆనందించే సినిమా అవుతుంది అని సినిమా యూనిట్ హామీ ఇస్తున్నారు. 
ఎట్టకేలకు మనకిష్టమైన జోనర్ మళ్ళీ సందడి చేయబోతుంది.