0px

"స్వాతిముత్యం" గా రానున్న..  బెల్లంకొండ తమ్ముడు "గణేష్" 

1 month ago

"అల్లుడు శీను"తో హీరోగా పరిచేయం అయిన నటుడు బెల్లంకొండ శ్రీనివాస్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ తనయుడే ఇతను. 
ప్రారంభంలోనే వినాయక్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేజిక్కిచ్చుకున్నాడు. 
అంచలంచలుగా రాణిస్తూ,కథ ఎంచుకోవడంలో సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ మంచి నటుడిగా గుర్తింపుతెచ్చుకొని,
ఇప్పుడు ప్రభాస్ నటించిన "ఛత్రపతి" సినిమాని బాలీవుడ్ లో చేస్తున్నాడు. 
తనని పరిచేయం చేసిన వినాయక్ తోనే హిందీలో ఈ సినిమా చేస్తున్నారు. 
తాను చేసిన సినిమాలు హిందీ దుబ్బింగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు మన శ్రీనివాస్. 
అందుకే,ఈ సారి కొంచెం భారీగా ధైర్యం కూడబెట్టుకొని ముందుకు వెళ్లారు. 
బెల్లంకొండ సురేష్ నిర్మాతగా అప్పుడప్పుడు ఈ మధ్య అడపా తడపా సినిమాలు చేస్తున్నప్పటికీ,
తన తనయుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.  ఇప్పుడు తన రెండో తనయుడు "గణేష్"ని వెండితెరకి పరిచయం చేసే పనిలో ఉన్నారని సినీ ఊరంతా బోగొట్ట. 
అదే నిజమే అని నిరూపిస్తూ కొన్ని నెలలముందు తొలి సినిమా పూజ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. 
ఆ సినిమా విశేషాలు నిన్నటివరకు పెద్దగా బయిటికి రానప్పటికీ, అసలు ఆ సినిమా ఉందా లేదా అనే ఊహాగానాలు రేకెత్తించాయి.
ఆ పుకార్లన్నిటికి తెర దించేస్తూ,బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఒక పోస్టర్ విడుదల చేశారు. 
ఆ సినిమా పేరే "స్వాతి ముత్యం".  సితార ఎంటర్టైన్మెంట్ పథకం పై,
సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన చిత్రం ఈ "స్వాతిముత్యం". 
ఇందులో గణేష్ తో పాటు,వర్ష బొల్లామా నటిస్తుంది. 
మంచి నటిగా విజిల్,మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి వరుస హిట్ల జోరులో ఉన్న వర్ష,
ఇప్పుడు ఈ సినిమాలో చేస్తుండటం కొంచెం ఆసక్తి కలిగించే విషయం. 
పుట్టినరోజు కాబట్టి సంబందించిన సాంకేతిక నిపుణుల్ని కూడా పరిచేయం చేస్తూ ఈ పోస్టర్ విడుదల చేశారు.
నూతనంగా పరిచేయం అవుతున్న గణేష్ కి అభినందనలు తెలుపుతూ ఎంతోమంది తమ శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ,
ఈ సినిమా పోస్టర్ ని తమ అధికారిక ఖాతాల్లో కూడా పంచుకోవటం జరిగింది. 
ఈ సినిమాకి చాలా ప్రముఖులు సాంకేతిక వర్గం చోటు చేసుకున్నారు. 
నవీన్ నూలి,వరుస హిట్ల జాబితాలో ఉంటున్న ఎడిటర్ పేర్లలో ఈయన ప్రముఖులు.
సూర్య, ఛాయాగ్రహణం బాధ్యతలు చేపట్టగా.. 
మణిశర్మ కుమారుడైన మహతి స్వర సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నారు. 
కొత్తగా పరిచేయం అయ్యి చేసింది అరా కోర సినిమాలైనా.. 
మహతి స్వర సాగర్ కి వారి నాన్నలనే మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణం ఇది. 
అందుకే పోస్టర్ లో పేరు చూడగానే ఈ సినిమా సంగీతం పై కొద్దిగా అంచనాలు అందుకున్నాయి.  
లక్ష్మణ్ కే కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 
ఈ సినిమా విడుదల వచ్చే సంవత్సరం వేసవి సెలవులకి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. 
ఏదైతేనేం, బెల్లంకొండ వారి నుంచి ఇంకో నటుడు తెలుగు తెరపై నటించబోతున్నారు. ఇది ఇలా ఉండగా,
సినిమా పేరు విషయమయ్యి సామాజిక మాధ్యమాల్లో కొంత చర్చలు జరుగుతున్నాయి. 
కమల్ హస్సన్ నటించిన స్వాతి ముత్యం తెలిసిందేగా. 
అది తెలుగు సినీ చరిత్రలోనే అతి గొప్ప విజయం సాధించి క్లాసిక్ గ నిలబడిపోయిన చిత్రం. 
కొన్నిసార్లు సినిమాలనే కాదు,క్లాసిక్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఏ సినిమా పేర్లనైనా అయినా సరే.. 
ఇప్పుడున్న జెనరేషన్ కి అనుకరిస్తే ఎంతో కొంత రిస్క్ ప్రభావం పడుతుంది అని చర్చాంశం అయ్యింది. 
అలంటి గొప్ప టైటిల్ పేరు పెట్టడమే గణేష్ చేస్తున్న పెద్ద రిస్క్ అని,
ఒకవేళ హిట్టు అయితే మంచి పేరుతో పాటు సగటు భాద్యత కూడా పడుతుంది.
కమల్ హస్సన్ సినిమాని "మరోచరిత్ర" కూడా సినిమాతో పాటు టైటిల్ ని రీమేక్ చేసారు కొన్నేళ్ల క్రితం. 
ప్లాప్ అయినా కూడా అసలు ఎందుకు క్లాసిక్ జోలికి వెళ్ళటం అని తిట్లు కూడా పడిపోయాయి. 
అందుకే,గణేష్ కూడా అలాంటి ఇబ్బందులు పడకుండా విజయం సాధిస్తే ఒక ప్రేక్షకుడిగా ఆనందించవచ్చు అనేది చర్చలు జరుగుతున్నాయి.
పోస్టర్ మాత్రం అదిరిపోయింది అసలు. 
బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని నెలలు టాలీవుడ్ లో కనిపించదు కాబట్టి అతని స్థానం ఇతను భర్తీ చేస్తాడని కూడా గుసగుసలాడుతున్నాయి వార్తలు.