0px

రాఘవేంద్ర రావు గారి "పెళ్లి సంద-డి " మొదలయ్యి మళ్ళీ మన ముందుకు.. !

1 month ago

పెళ్లి సందడి, ఈ పదం వినగానే తెలుగు ప్రేక్షకుడు ఒకే ఒక్క సినిమాని అరక్షణంలో గుర్తు తెచ్చుకుంటారు. 
అదే రాఘవేంద్ర రావు గారు తీసిన క్లాసిక్ "పెళ్లి సందడి ". 
1996 లో విడుదల అయిన ఈ సినిమా.. 
ఒక రొమాంటిక్ మ్యూజికల్ మెలోడీ చిత్రంగా నిలిచిపోయింది. 
శ్రీకాంత్-దీప్తి భట్నాగర్-రవళి కాంబినేషన్ లో వచ్చిన మొట్ట మొదటి సినిమా. 
అల్లు అరవింద్ మరియు ఆశ్వని దత్త్ గారి నిర్మాణ సారధ్యంలో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిన ఒక సంచలనం. 
జనవరి సంక్రాంతి కానుకగా విడుదలయిన ఈ సినిమా, 
ఆరోజుల్లోనే భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క బడ్జెట్టు 85లక్షలు కాగా,
15 కోట్ల వసూళ్ళని సాధించింది.
చరిత్రలో నిలిచిపోయే ఫామిలీ డ్రామా గా స్థానం దక్కించుకొని రికార్డులు సృష్టించింది.  రాఘవేంద్ర రావు అంటేనే విభిన్నమైన చిత్రీకరణకు ప్రతీతి. 
ఆయన సినిమాల్లో ఉండే పాటలు,ఆ పాటల్లో ఉన్న నటులు,ప్రతి ఫ్రేములో పూలు పండ్లు,
ఇలా ఒక్కటేంటి, ప్రపంచంలో అందంగా ఉండేంత పోలికలన్నీ ఆయన ఫ్రేమ్ లోనే కనిపిస్తాయి. 
అన్ని సినిమాలు ఒక ఎత్తు,కానీ ఈ "పెళ్లి సందడి" మాత్రం ఇంకో ఎత్తు అనటంలో సందేహమే లేదు. 
ముందు మాటగా సినిమా మొత్తం పాటల వల్లే హిట్ అయ్యింది అనేది నిజం. 
అయితే ఆ పాటలు వినేకొద్దీ ఎంత బాగుంటాయో, చూసేకొద్దీ కూడా అంతే బాగుంటాయి. 
ప్రతి పాటకి ఒక సారాంశం దాగి ఉండటం, ఆ సారాంశాన్ని తెర నిండా నటీనటులతో తెలియపరచటం అనేది ప్రత్యేకత.  
ఏ జెనరేషన్ అయినా సరే ఈ సినిమా చూస్తూ ఒక మైకంలోకి మునిగిపోవాల్సిందే. 
సత్యానంద్ ముచ్చటైన సంభాషణలు రచించగా,కీరవాణి గారు మైమరపించే సంగీతం సమకూర్చారు.
ఈ సినిమా రాఘవేంద్ర రావు గారు తన సొంత బ్యానర్ పై సమర్పణ చేయటం విశేషం. 
తెలుగు నాట ఘన విజయం సాధించిన ఈ సినిమాని హిందీ మరియు తమిళంలో రీమేక్ కూడా చేశారు . 
ఎన్ని తరాలు మారిన "సౌందర్య లహరి" అనే పదానికి కూడా అభిమానులు ఉండటం ఈ చిత్రం వల్లే సాధ్యం అయ్యింది. 
ఇందులో ఈ పదం వాడిన పాత అలాంటిది మరి.
ఇంత గొప్ప సినిమా మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తుంటే? అవును,"పెళ్లి సందడి" రీమేక్ గా సందడి చేయడానికి మళ్ళీ ఈ సంవత్సరం రానుంది. 
కాకపోతే ఈ సారి శ్రీకాంత్ బదులు అతని తనయుడైన "రోషన్" ఇందులో హీరో గా నటిస్తున్నారు. 
 "శ్రీ లీల" ఈ చిత్రం ద్వారా నూతన నటిగా పరిచేయం కాబోతుంది. 
రాఘవేంద్ర రావుగారు దర్శకత్వం చేయనప్పటికీ,
ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో "గౌరీ రోణంకి" అనే దర్శకురాలిని పరిచేయం చేయబోతున్నారు.  
క్లాసిక్ గా నిలిచిపోయిన సినిమాని రీమేక్ చేస్తుండటం వల్ల,
అభిమానులు ఎలాంటి నిరాశకు లోనవ్వకూడదు అనే భావంతో.. 
ఈ చిత్రాన్ని నిర్మించి రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు.  ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ఈరోజే యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. 
రాఘవేంద్రరావు గారి దర్శకత్వ శైలికి తగ్గట్లుగానే అందంగా కనపడటం విశేషం. 
రీమేక్ టైటిల్ అయినప్పటికీ అందరిని మెప్పించే పనిలో నిమగ్నమయినట్లు టీజర్ చూస్తేనే తెలిసిపోతుంది. 
ఇంకొన్ని గంటల్లో ఈ చిత్రం యొక్క టీజర్ పది లక్షల వీక్షణలకు చేరువలో ఉంది. 
సాధారణంగా ట్రైలర్లు విడుదల అయినప్పుడు,సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. 
కానీ, ఈ సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్ జంట ఎంత బాగున్నారో  అన్న పొగడ్తలు వినిపిస్తుండటం సందడిగానే మారింది. 
ఎప్పటిలాగే కంటికి ఇంపుగా పూలు పండ్లతో,భారీ తారాగణం తో ఈ టీజర్ ఉండటం మళ్ళీ 1996 నాటి పెళ్లి సందడిని గుర్తు చేస్తుంది అని అభిమానులు సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలతో పేర్కొంటున్నారు.  ఈ చిత్రం నుంచి గత నెలల ముందు విడుదల అయినా మూడు పాటలు,
తెలుగు ప్రేక్షకులందరిని అలరించాయి. 
అచ్చ తెలుగు పదాలు మళ్లీ చాలా నెలల తర్వాత ఒక పాట రూపంలో కనిపించటంతో పాతరోజులు గుర్తొస్తున్నాయని మిల్లీనియం కి సంబందించిన సంగీత ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణ అంటే ఆ మాత్రం కిక్కుతో కూడిన ఉల్లాసం ఉండనే ఉంటుంది మరి.  ఈ సినిమాని ఆయన తన సొంత బ్యానర్ లోనే  నిర్మిస్తున్నారు. 
వీరితోపాటు శోభు యార్లగడ్డ,ప్రసాద్ దేవినేని,మాధవి కోవెలమూడి నిర్మాతలుగా కలిసి రూపొందిస్తున్న చిత్రం ఇది. 
రాఘవేంద్ర రావు గారి ఆస్థాన సంగీత దర్శకులు అయిన కీరవాణిగారు ఈ చిత్రానికి సంగీతం అందించటం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణంగా మారింది. ఇంకేముంది రీమేక్ అనే మాట పక్కన పెట్టేసి మళ్ళీ  ఆ పెళ్లి సందడే వస్తుందేమో అన్నంతగా లీనమైపోతున్నారు అభిమానులు. 
కొన్ని సినిమాలకు అభిమానులు అనటం కంటే వాటిని భద్రంగా క్లాసిక్ గా గుర్తించి అమాంతం పిచ్చి పెంచేసుకొని ప్రేమించే వారు అంటేనే సరిగ్గా ఉంటుందేమో. 
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. 
ఎడిటింగ్ లో ఎన్నో ఏళ్లగా నైపుణ్యం చూపిస్తున్న "తమ్మిరాజు" ఈ సినిమాకి ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. 
ఆర్ట్ డిరైక్టర్ గా కిరణ్ కుమార్ మన్నే,
సాహిత్యాన్ని చంద్రబోస్  మరియు శివశక్తి దత్త రచిస్తున్నారు. 
ఫైట్స్ కి గాను వెంకట్ గారు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. 
ఈ సినిమా,దసరాకి విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు సమాచారం. 
అన్ని కుదిరితే,మళ్ళీ ఈ జనరేషన్ వారు కూడా థియేటర్లో అప్పటి "పెళ్లి సందడి" లాగా  వీక్షించే అవకాశం నిజంగా సందడి గానే ఉంటుంది.  చివరిగా ఒక చిన్న వార్త,
స్వయానా రాఘవేంద్ర రావు గారే మొట్ట మొదటిసారిగా ఇందులో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. 
కొన్ని రోజుల క్రితం దానికి సంబందించిన ప్రోమో వచినప్పటికీ,
తన క్యారెక్టర్ నిడివి ఎక్కువ ఉంటే ఇంపుగా ఉంటుంది అని అభిమానులు ఆశపడ్తున్నారు.