0px

'బాలకృష్ణ రౌడీయిజం’ చేయబోతున్నారా ...?

1 month ago

'అఖండ' సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ  ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న  విషయం తెలిసిందే. 'క్రాక్' సినిమా విజయంతో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని, బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. మైత్రీ మూవీస్ ఈ సినిమాను  నిర్మించనుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకు ‘రౌడీయిజం’ అనే టైటిల్ ను మైత్రీ  మూవీస్ ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేసినట్లు సమాచారం.అంతేకాకుండా ఈ సినిమా టైటిల్  ను  కూడా త్వరలోనే అధికారికంగా  ప్రకటించబడుతున్నదని తెలుస్తున్నది . యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్నా ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ  సినిమాలో నటించనున్న హీరోయిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్రిష, ఇలియానాలలో ఒకరికి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.